8, నవంబర్ 2020, ఆదివారం

మారుతున్న కాలాలు

నేను పెద్దగా చదువుకోలేదు. కాని చూస్తున నేరాలను చూసి రాయలనిపించింది. 


ఒకప్పటి కాలానికి ఇప్పటికాలానికి తేడా కారణం - పాపం.

ధర్మదేవత ఒంటికాలితో పోరాడుతోంది. అందుకే కరొనాలు, తూఫానులు. ఎందుకు, ఎందుకు మనుషులలో ఇంత అరాచకం? పోయేటపుడు జానెడు బట్టకూడా మనతో రాదె? మహా అయితే 50,60 యేళ్ళు బ్రతకడానికి ఇన్ని చేయాలా? 

 అప్పట్లో ఆ కాలంలో డబ్బులేకపోయిన పచ్చని పొలాలు కలుషితంలేని పాలు పెరుగు, ఎరువులు  లేని పంట, కూరగాయలు...ఎంత బావుండేదో.

ఏ కోరికలు లేవు. హాయిగా కడుపునిండా తిని కమ్మటి నిద్ర పోయేవాళ్ళం.ఇపుడు డబ్బు డబ్బు డబ్బు. ఎలాగైన సంపాదించాలి. చదువుకున్నవాడు అమెరికా వెళ్ళి కోట్లు సంపాదించాలి.కారు బంగళా విలాసవంతమయిన జీవితం కావాలి. అమ్మ నాన్న చనిపోయినా వచ్చి చూసే తీరిక లేనివాళ్ళు ఉన్నారు. అంతడబ్బు సంపాదించినా ఒంట్లో రోగాలే, నిద్రపోలేడు, తిండితినలేడు. కారణం తినేదంత విషపూరితమైన ఆహారమేగా.   

ఇక చదువులేనివాడు. వీడికి విలాసాలు కావాలి. దానికి ఉన్నవాణ్ణి దోచుకోవాలి, లేదా చంపాలి, నరకాలి.  ఏమైన సరె డబ్బుకావాలి. అది పాపమా అనే అలోచన కూడా రాదు.ఒకరిని ఒకరు మోసం చేసుకోడం.ప్రేమలు లేవు. దారుణం. 

ఆకాలం లో మా నాన్న పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళం. పచ్చని పొలంలో మంచం వేసుకొని పడుకునేవాళ్ళం. హాయిగా ఇంటిబయట చల్లనిగాలికి సేదతీరేవాళ్ళం. కాని ఇపుడు ధైర్యంగ పడుకోగలిగెవాళ్ళెవరు?  

మా అమ్మవాళ్ళు ఐదుగురు అక్కచెల్లెళ్ళు. ముగ్గురు అన్నదమ్ములు. ఆరునెలలకొకసారి అందరు కలిసేవాళ్ళం. కలిసి వండుకొనితిని అనందంగా మాట్లాడుకొనేవాళ్ళం. అన్నలు ఇచ్చే ఆడపిల్ల కట్నం యాభైరూపయలిస్తే సంతోషంగా తీస్కొని ఇంటికొచేవాళ్ళం. ఇపుడు నెను వెళితే నాకేం వస్తుంది. వాళ్ళు వస్తే ఏం తెస్తారు. అదీ అలోచన. అప్పటి ఆలొచన, ఆరొగ్యం గురించి అలోచించండి. మంచితనం అలవర్చుకోండి. ధర్మాన్ని పాటించండి. మనసు నిర్మలంగా ఉంచుకోండి. కాలుష్యం పారద్రోలండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి