7, నవంబర్ 2020, శనివారం

విధివ్రాత



అది మాధవాపురం. ఒక చిన్న పల్లెటూరు. నూటయాభయి గడపలు. పచ్చని పొలాలు. చూస్తేనే ఆనందం!


ఆ కాలంలోనె కరణం వారి ఇళ్ళు చూస్తె మతిపోతుంది.డూప్లెక్సు బంగళా.  పేద్ద వాకిలి. సరస్వతమ్మ అంటేనే శాస్త్రాలు గుర్తొస్తాయి. మెట్లకింద పిల్లలు ఆడుకునే చిన్న రూము అంటే చుట్టుపక్కల పిల్లలకి ఎంతో ఇస్టం ఉండేది. బంగళా పక్కనే ఒక పెద్ద బురుజు. బురుజు కింద మైసమ్మ. ప్రతి సంవత్సరం మైసమ్మ జాతర బైండ్లోడు వస్తాడు. సిగాలూగడం ఊరిజనాల  హడావిడి ఎంత బాగ ఉంటుందో. ఆ జాతరలో జిలేబిలు కొనుక్కు తినడం కోసం పిల్లలు ఆరాటపడెవాళ్ళు. మగవాళ్ళు ఆడవేషాలతో డాన్సులు వెయడం. అసలు ఆ ఊరి జాతర కళనే వేరు. 


"యేం. బాగున్నవా?" అడిగాడు వెంకటెశ్వర శర్మ, వాల్ల ఇంటి పక్కింట్లో ఉండే బ్రాహ్మడు యాత్తర్లకెళ్ళి వస్తూ అడిగాడు. "ఆ యేం బాగుండడంలే. కనబడడం లేదా" అందామె. సూటిగా సమాధానం చెప్పదుకదా!.


సరస్వతమ్మకి కరణంకి ముగ్గురు ఆడపిల్లలు. ఒక్కగానొక్క కొడుకు, శివ. చాల గారబంగా పెంచారు. వెంకటెశ్వర శర్మ కొడుకు రాము, శివ ఇద్దరు ఒకే క్లాస్ లో చదివారు. 


ఒకనాడు కరణం పెళ్ళిల్ల పేరయ్యని పిలిపించాడు. కూతుర్లు అరుణ, కమల, బుజ్జికి సంబంధాలు చూడాలి. 

పేరయ్య "పక్కనే తుర్కపల్లి లో చక్కని సంబంధం ఉంది. మీరేమంటారు దొరా" అని సంబంధం విషయాలు అన్నీ చెప్పాడు.

"మంచిది. పిల్లని చూడడానికి రమ్మనండి మరి" అన్నడు కరణం.


అలా అరుణకి, కమలకి పెళ్ళిళ్ళు అయిపొయాయ్. చూస్తుండగానె అరుణకి నలుగురు సంతానం. ఆనందంగా సాగుతున్న సంసారం చూసి కరణం, సరస్వతమ్మ చాల సంతోషించేవాళ్ళు.


"మన శివకి బుజ్జి కి కూడా పెళ్ళిళ్ళు చేద్దామండి. మన వయసు యాభయి దాటింది.  ఇంక ఆలస్యం మంచిది కాదు" అంది సరస్వతమ్మ. 

వనపర్తి నుండి బుజ్జికి, దాచారం నుండి శివ కి మంచి సంబంధాలు వచ్చాయ్. ఆలస్యం చేయకుండ అపెళ్ళిళ్ళు చేసేసాడు కరణం. శివకి తన భార్య రమణమ్మ తో ఇద్దరు మగపిల్లలు. కన్ని, చిట్టి అని ముద్దుగా పిలుచుకునే వాళ్ళు. ఎపుడూ ఆ ఇళ్ళు కూతుర్లు, అల్లుళ్ళు, పిల్లలతో కళకళలాడుతూ ఉంటే ఊర్లో వాళ్ళకి అదొక భూతలస్వర్గం లా కనబడేది. 


ఒకరోజు సడన్ గా హార్ట్ అటాక్ తో కరణం చనిపోయాడు. సరస్వతమ్మకి కష్టాలు మొదలయ్యయి.

ఆరోజు మంగళవారం. అరుణ పెద్దకూతురు విజయతో కలిసి పెరట్లో తోటకూర కోస్తుంది సరస్వతమ్మ. శివ భార్య రమణమ్మ తన పిల్లలకి స్నానంపోస్తుంది. అపుడే పిడుగులాంటి వార్త. తనరెండొకూతురు కమల ఇంటిపని చేస్తు, గచ్చులో జారిపడి చనిపొయిందని. సరస్వతమ్మ కుప్పకూలిపొయింది. కొద్దిసేపట్లోనే మరొకవార్త. బుజ్జి నీటిలో పడి చనిపోయింది అని. ఒకేరొజు రెండు పిడుగులాంటి వార్తలని ఎలా జీర్ణించుకోవాలో కూడ అలోచించే స్థితిలో లేదు సరస్వతమ్మ. 


వనపర్తికి వెళ్ళేసరికి వాకిట్లో శవాన్ని పడుకోబెట్టారు. నీళ్ళుమింగి ఆ దేహం ఉబ్బిపోయి ఉంది. కనీసం యేర్పాట్లు చూడడానికి కూడా ఎవరు లేరు. సరస్వతమ్మ భోరున ఎడుస్తూ కుప్పకూలిపొయింది. లోపల టీ తాగుతూ కూర్చున్న బుజ్జి భర్తని చూసి వెంకటేశ్వర శర్మ కోపం ఆపుకోలేకపోయాడు. గొడవపెట్టాడు. "మా బుజ్జి ని చంపేసారు" అంటూ అరుస్తున్నాడు.  


బుజ్జి పక్కన కూర్చున్నాడు శివ. ఏం తోచట్లేదు. బిత్తరచూపులు చూస్తున్నాడు. మెల్లిగా ఆపెదాలమీద చిరునవ్వు వచ్చింది. అది వెర్రినవ్వులలాగ మారిపొయింది. "రా బుజ్జి. మన ఊరెల్దాం పద. మాధవాపురం వెళ్ళి మన ఇంటి మెట్లకింద ఆడుకుందం పద. లెవ్వు. పద" అంటూ లేపుతున్నాడు ఆ శవాన్ని. పక్కన కూర్చున్న భార్య రమణమ్మ "ఏమైందండి? ఎందుకల మాటాడుతున్నారు" అని దగ్గరకి వచ్చింది. "హెయ్.. జరుగు. నా చెళ్ళితో మాట్లాదుతుంటే నువ్వెవరు మధ్యలో. చంపేస్తా" అంటూ అరుస్తున్నాడు. బలవంతంగా శివ ని పట్టుకొని, బుజ్జి కి అంతిమ సంస్కారాలు చెసేసారు. 


"పాపం. శివ కి బుజ్జి దయ్యమై పట్టింది" అనుకునెవాళ్ళు ఊరివాళ్ళు. శివ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పిల్లల్ని, రమణమ్మని, అమ్మని ఇస్తం వచినట్లు కొట్టడం, బట్టలిప్పుకొని తిరగడం, బంగళాపైకి వెళ్ళి చెల్లితో ముచ్చటపెట్టడం. వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఎవరైన అన్నం పెట్టమని అడగడం పెడితే తినడం. డిగ్రీ చదివిన శివ వరుస బిచ్చగాడిలా అయింది.


సరస్వతమ్మ బ్రతుకు ఘోరమయింది. ఆ బాధ భరించలేక కోడలు పిల్లలని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ కొడుకుతో సరస్వతమ్మ అంతపెద్ద బంగళాలో ఉండడం నరకప్రాయమయింది. 

రాత్రి అయితే మెట్లపై గలగలా గజ్జెల శబ్దం వినబడేది. నీడలా ఒక ఆకారం పరుగుపరుగున వచ్చి మాయమయ్యేది. అది చూసినవాళ్ళు విన్నవాళ్ళు భయంతో వణికిపోయేవాళ్ళు. అందరూ బురుజు నీడ మీ ఇంటిమీద పడి ఇలా అయింది వాస్తు దోషం అనేవాళ్ళు. 


ఒకనాడు సరస్వతమ్మ అరుణ దగ్గరికి వెళ్ళింది. అక్కడే ఆమె జీవితం ముగిసింది పాపం. 


కాలచక్రం తిరుగుతోంది. శివ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. అపుడపుడూ వచ్చి శివకి స్నానం పోసి కొత్తబట్టలు వేసి అన్నం పెట్టి వెళ్తారు. పాపం, శివకి వాళ్ళు కొడుకులు అనికూడా తెలీదు.


ఒకనాడు కళకళలాడిన బంగళా ఇపుడు దీనస్థితికి చేరుకుంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటారు. ఇదేనేమో మరి. ఇది భగవంతుడు ఆడే ఆట.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి