15, నవంబర్ 2020, ఆదివారం

యోగి (కల్పిత కధ)

సెలవులు అయిపొయాయ్. కాలేజీలు తెరుచుకున్నాయ్. అంతా హడావుడి. స్టూడెంట్స్, లెక్చరర్లు పరుగులు. అమర్ కూడా ఆలస్యం అవుతోందనుకుంటూ బండి స్టార్ట్ చేసి ఫొన్ చేతిలోకి తీసుకున్నాడు. "హే అనితా, ఏం చేస్తునావ్...హా, రెడీగా ఉండు. బస్ స్టాండ్ దగ్గర పిక్ చేసుకుంటాను" అంటూ ఫొన్ పెట్టేసి బండి కదిలించాడు.పదింటికల్లా కాలేజి చేరారు ఇద్దరు. 

అమర్ తండ్రి చాల సంవత్సరాలక్రింద ఆచార్య సన్యాసం తీసుకున్నాడు. ఆయన ఉండేది ఒక పెద్ద ఆశ్రమం. ఆయన దర్శనంకోసం భక్తులు వస్తూ ఉంటారు. అనిత తండ్రి అమర్ కి మేనమామ అవుతాడు. అనిత చాల అందమైనది. అనితను చూడగానే  అమర్ కి ముచ్చటేస్తుంది. అలా తెలిసి తెలియకనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరోజు అమర్ విషయం అమ్మతో చెప్పాడు.  "అమ్మా, అనిత అంటే నాకు ప్రాణం. పెళ్ళిచేసుకోవాలని  అనుకుంటున్నా" అని చెప్పాడు.తండ్రితో ఎలాంటి సంబంధాలు లేవు. కాని భగవంతుడి స్వరూపంగా నమస్కరించి విషయం చెప్పాడు. స్వామివారి ఆశీర్వాదంతో అనిత అమర్ ల వివాహమయింది.   

చూస్తుండగానె సంవత్సరం అయింది. బాబు పుట్టాడు. మేనరికం కారణం తో బాబు శరీరం ఆరోగ్యంగా లేదు. బాబుకి ఆరు నెలల వయసు ఉన్నపుడు అమర్ వాళ్ళ అమ్మకి కాలు విరిగింది. లేవలేని పరిస్థితి.  శక్తివంచన లేకుండా అత్తగారి సేవ చేసింది అనిత. బాబుని హాస్టల్ లో వేసింది. రోజులు గడుస్తున్నాయ్. తల్లిగారి ఇంటికివెళ్ళి కూడ నాలుగేళ్ళయింది. పాపం అనిత!

అలా కొన్నేళ్ళు గాడిచాయ్. ఒకనాడు అమర్, అనిత తెలిసినవాల్ల పెళ్ళికి బండిపై వెళ్ళి వస్తున్నారు. రాత్రి ఎనిమిది అయింది. మెడలో చాల బంగారం ఉంది. ఎక్కడనుండి వచ్చారో, ఒక్కసారిగ దొగలు మీదపడ్డారు. మెడలో ఉన్నదంతా దోచుకొని అమర్ ప్రతిఘటించడంతో అతన్ని బాగ కొట్టారు.  అమర్ ని హాస్పిటలో చేర్పించారు. ట్రీట్మెంట్ పూర్తిచేసుకొని ఇంటికివచ్చారు, కాని అమర్ అనిత తో సుఖంగా ఉండలేకపోయాడు. తను సంసార జీవితానికి ఇక పనికిరాడని అమర్ కి అర్ధమయింది. పెళ్ళి తర్వాత కష్టాల ఊబిలో ఉన్న అనిత కి ఈ విషయం శరాఘాతంలా తాకింది. జీవితం చీకటిపడిపోయింది. 

కొంతకాలం అయింది. ఆచార్య స్వామి సమాధి కావడానికి సిద్ధమయారు. స్వామి తర్వాత ఆ పీఠంపై కూర్చునేవాళ్ళు ఎవరు? అపుడు అమర్ భార్యతో అలోచించాడు. మన జీవితంలో ఆనందం ముగిసింది. కనీసం ఆశ్రమాన్ని కాపాడుకుందాం అన్నాడు. సరే అంది అనిత. 

పరోపకారం ఇదం శరీరం. శరీరం మానవులకు ఉపయోగపడాలి.  సన్యాసం అంటే మాటలు కావు. గోచి తప్ప ఖరీదయిన బట్టలు, అలంకారాలు ఉండవ్. ఎండకి, వానకి, చలికి ఆ శరీరం అలవాటు పడిపోవాలి.  ఒక్కపూట పిడికెడు అన్నం బిక్ష తెచ్చుకొని తినాలి. రాత్రి కందమూలాలో,పండ్లో. అంతే! నిరంతర దైవ ధ్యానమే తప్ప వేరే అలోచన రాకూడదు. 

అమర్ రెండు సంవత్సరాలు కఠిన సాధన చేసి భార్య భిక్షతో అమరేంద్ర యోగి అయ్యాడు. భార్య కూడా అదే ఆశ్రమంలో స్వామి సేవ చేసుకుంటూ యోగినిలా ఉండిపోయింది. ఇపుడు ఆ స్వామి మహిమలు చిన్నవి కావు. ఆయ్న నోటివెంట ఏదివస్తే అది జరిగిపోతుంది.  

ఇది విధిలిఖితం. భగవతుడు ఎవరి జీవితాలు ఎటు తిప్పుతాడో. జై అమరేంద్రస్వామి!    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి